#ANDHRA ELECTIONS #Elections

ఎట్టి పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి రాదు: విజయసాయిరెడ్డి

బాపట్ల: జగన్‌ పాలనలో ఏపీ అభివృద్ధి చెందిందని.. కాబట్టే రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో వైఎస్సార్‌సీపీ నిర్వహించబోయే సిద్ధం ముగింపు సభ ఏర్పాట్లను గురువారం సాయంత్రం పర్యవేక్షించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. 

జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికలకు సిద్ధం అయ్యాం. సిద్ధం సభలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. మేదరమెట్ల సభకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మా అంచనా ప్రకారం 15 లక్షల మంది వస్తారని అనుకుంటున్నాం.  సభా ప్రాంగాణాన్ని అవసరమైతే ఇంకో 200 ఎకరాలకు పొడిగిస్తాం. ఇదే ఆఖరి సిద్ధం సభ.. 

.. వైఎస్సార్‌సీపీ సంక్షేమ పాలనలో  ఏపీలో 87 శాతం కుటుంబాలు సంక్షేమ పథకాలు పొందారు.  ఏపీ అభివృద్ధి చెందినది కాబట్టి తలసరి ఆదాయం పెరిగింది. రామాయపట్నం పోర్ట్ ని రికార్డు సమయంలో ముఖ్యమంత్రి పూర్తి చేశారు. పోర్టులు అభివృద్ధి పరిచాం. ఇదంతా అభివృద్ధి కాదా?. విశాఖ ఎయిర్‌పోర్టును కూడా అభివృద్ధి చేస్తున్నాం​. కాబట్టి.. తప్పడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొదు. 

.. టీడీపీ జనసేన 20 ఎకరాలలో సభ పెట్టి  6 లక్షలు  వచ్చారని డబ్బాలు కొట్టారు. టీడీపీ బీసీ డిక్లరేషన్ అనేది హాస్యాస్పదం. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారు అని గతంలో చంద్రబాబు అన్నారు. కానీ, 75 శాతం ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదవులిచ్చారు. 2024 ఎన్నికలకు నోటిఫికేషన్ తర్వాత ఎన్నికల ప్రచారం ముమ్మరం అవుతుంది. ఎటువంటి పరిస్థితిలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాదు. మా టార్గెట్ 175 సీట్లు కొట్టి తీరుతాం. మేదరమెట్ల సిద్ధం​ వేదికగా వచ్చే ఏదేళ్లలో చేయబోయే కార్యక్రమాల్ని వివరిస్తాం. రాబోయే కాలంలో మరింత చిత్తశుద్ధితో పనిచేస్తాం’’ అని విజయసాయిరెడ్డి అన్నారాయన.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *