Warangal – సందేహాలను నివృత్తి చేసేందుకు కంట్రోల్ రూం

గ్రేటర్ వరంగల్:వరంగల్ తూర్పులో సభలు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రిజ్వాన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతుల కోసం గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సెల్, కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, ర్యాలీలకు 48 గంటల ముందుగా అనుమతి తీసుకోవాలని, సింగిల్ విండో సెల్ విధానం ద్వారా అన్ని రకాల అనుమతులు ఇస్తామని చెప్పారు. సందేహాలను నివృత్తి చేసేందుకు కంట్రోల్ రూంలో సిబ్బంది అందుబాటులో ఉంటారు. మంగళవారం సాయంత్రం అడిషనల్ కమిషనర్ రషీద్ రాజకీయ పార్టీల కంట్రోల్ రూం, సువిద సెల్ ను తనిఖీ చేశారు. ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సూపర్వైజర్ ఆనంద్, డీటీ మధుసూదన్, ఏఎస్ఓ వెంకన్న, సీనియర్ అసిస్టెంట్ మధు చంద్ర పాల్గొన్నారు.