Vaddiraju RaviChandra : తెలంగాణాభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణాభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాజ్యసభ సభ్యులు, నియోజకవర్గ బాధ్యులు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. స్థానిక ఏవీఆర్ వేడుకల మందిరంలో శుక్రవారం భారాస మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూరుతోందన్నారు. కాంగ్రెస్, భాజపా ఎన్నికలకు ముందు హామీలతో బురిడీలు కొట్టించి ప్రజలను మాయచేస్తారన్నారు. వారి ప్రలోభాలకు గురి కాకుడదన్నారు. ఎమ్మెల్యే హరిప్రియ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించి అవిరామంగా పాటుపడ్డారని వెల్లడించారు. ఆమెకు మరోమారు ఆశీర్వదించి ఓట్లేసి గెలిపించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. తిర్లాపురం, గార్లలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో శంకుస్థాపన చేశారు. గార్ల రైల్వే అభివృద్ధికమిటీ సభ్యుల విన్నపం మేరకు రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా రైల్వే అధికారులతో ప్రజాప్రతినిధులు చరవాణిలో మాట్లాడారు. గార్ల సీహెచ్‌సీలో ఎక్స్‌రే ల్యాబును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎంపీపీ శివాజీ, సర్పంచి బన్సీలాల్, ఎంపీటీసీ సభ్యులు రమేష్, శీలంశెట్టి వీరభద్రం, రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. సమావేశంలో పలువురు భారాసలో చేరారు. అంతకుముందు గ్రామంలో భారాస శ్రేణులు ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు.