Frequently road accidents-తరచూగా రోడ్డు ప్రమాదాలు

ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణం సమీపంలో ఉన్న సూర్యలక్ష్మి కాటన్ మిల్లు వద్ద గురువారం జాతీయ రహదారుల విభాగం, పోలీసు శాఖ ప్రతినిధులు హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిని పరిశీలించారు. జాతీయ రహదారిపై ఉన్న సూర్యలక్ష్మి కాటన్ మిల్లు వద్ద తరచూ వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాద స్థలాన్ని జాతీయ రహదారుల విభాగం ఏఈ గంగాధర్, షాద్‌నగర్ ట్రాఫిక్ ఎస్‌ఐ రవీంద్రనాయక్, ఆమనగల్లు ఎస్‌ఐ బలరాం, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్‌రెడ్డి పరిశీలించారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాట్లాడారు.