Konda Laxman’s biography-కొండా లక్ష్మణ్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో

స్వాతంత్య్ర సమరయోధుడు, తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి చలమల్ల నర్సింహులు కోరారు. గురువారం సూర్యాపేట టౌన్‌లోని ఎంజీ రోడ్డులోని మహాత్మా జ్యోతిరపూలే విగ్రహం వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1969లో తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్నారని, 95 ఏళ్ల వయసులో కూడా ఢిల్లీలో నిరాహార దీక్ష చేసి మలిదశ ఆందోళనలో పాల్గొన్నారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి తన ఇంటిని విరాళంగా ఇచ్చి చివరి శ్వాస వరకు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉంటూ ఉద్యమానికి ప్రాణం పోశారని పేర్కొన్నారు. చేనేత సహకార సంఘాలను స్థాపించేందుకు ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. సూర్యాపేటలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరారు.