Siddipet – వేర్వేరు చెక్ పోస్టుల వద్ద రూ.4.88 లక్షల పట్టివేత.

సిద్దిపేట :గురువారం రూ. 4.88 లక్షలను పలు చెక్‌పోస్టుల నుంచి పోలీసులు తీసుకెళ్లారు. మిరుదొడ్డి మండలం అల్వాల చౌరస్తాలో ఆటోలను తనిఖీ చేశారు. జంగపల్లి నర్సింలు ద్విచక్ర వాహనాన్ని పరిశీలించగా రూ.3.49 లక్షల నగదు లభించింది. తగిన ఆధారాలు లేనందున డబ్బును జప్తు చేసి కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ మల్లేశం, మిరుదొడ్డి ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా డబ్బు తరలిస్తే పరిణామాలు ఉంటాయన్నారు.
మండలంలోని అయినాపూర్ చెక్‌పోస్ట్ వద్ద రూ.2.39లక్షల నగదు పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అయినాపూర్ చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో రెండు వేర్వేరు కార్లలో రూ.2 లక్షల 39 వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.