Minister KTR will once again contest from Siricilla – మంత్రి కేటీఆర్ మరోసారి సిరిసిల్ల నుంచి పోటీ చేయనున్నారు

మంత్రి కేటీఆర్ మరోసారి సిరిసిల్ల నుంచి పోటీ చేయనున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఉమేష్ రావు, కేకే మహేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి టికెట్ కోసం కటకం మృత్యుంజయం, లగిశెట్టి శ్రీనివాస్, రెడ్డబోయిన గోపి, ఆరె ప్రవీణ్ ప్రయత్నిస్తున్నారు. వేములవాడలో చల్మెడ లక్ష్మీనర్సింహారావుపై కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి డా.వికాస్ రావు, తుల ఉమల్ ప్రయత్నిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన భవిష్యత్ కార్యాచరణను బట్టి ఇక్కడి పార్టీల బలాబలాలు కొంతమేర మారే అవకాశం ఉంది.