ISRO : ఇస్రో శాస్త్రవేత్తగా సిరిసిల్ల యువకుడు

సిరిసిల్లకు చెందిన యువకుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తగా నియామకమయ్యాడు. పట్టణానికి చెందిన మంచికట్ల సుశాంత్‌వర్మ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించారు. ఆయన ప్రాథమిక విద్యను కరీంనగర్‌లోని కేంద్రీయ విద్యాలయంలో పూర్తిచేశారు. వివేకానంద కళాశాలలో ఇంటర్ పూర్తిచేసి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేసి మెరిట్ విద్యార్థిగా ఇస్రో సైంటిస్ట్‌గా ఉద్యోగం సాధించారు. సుశాంత్‌వర్మ చిన్నతనం నుంచే పరిశోధనలపై ఆసక్తి కనబరిచేవారు. ఆయన తండ్రి రాజేశం సిరిసిల్ల మున్సిపల్ మెప్మా విభాగంలో కోఆర్డినేటర్‌గా పని చేస్తున్నారు. తల్లి బోయినపల్లి మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయినిగా విధులు నిర్వర్తిస్తున్నారు.