punished-చంపడానికి ప్రయత్నించిన వారిని శిక్షించాలి

మోర్తాడ్ (బాల్కొండ) : మండలంలోని రామన్నపేటలో రాజారపు లింబాద్రిపై హత్యాయత్నానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన నలుగురు ముదిరాజ్ కులస్తులు ఈ నెల 18న గ్రామస్తులను చంపుతామని బెదిరించారని, బుధవారం మరోసారి బస్టాప్‌లో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ రాస్తారోకోను అదుపులోకి తీసుకున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ వెంకటేశ్వర్లు, మోర్తాడ్ ఎస్సై అనిల్ రెడ్డి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు రాస్తారోకోను విరమించారు.