Overcrowding of patients at GGH – జీజీహెచ్‌లో రోగుల రద్దీ

వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులతో(Seasonal Diseases) రోగులు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. వారం రోజులుగా నిజామాబాద్(Nizamabad) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. ఈ నెల 9న ఔట్ పేషెంట్లు 1323, ఇన్‌పేషెంట్లు 140, 11న ఓపీ 1698, ఐపీ 181, మంగళవారం ఓపీ 1635, ఐపీ 218 నమోదైంది. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు తదితర సమస్యలతో ఎక్కువగా వస్తున్నారు. మంగళవారం ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ విభాగం వద్ద పేర్లు నమోదు కోసం ఇలా బారులు తీరారు.