MLC Kavita Struggle that resulted – కవిత పోరాటం ఫలించింది

నిజామాబాద్‌నగర్ : శాసనసభలో 33 శాతం మహిళా ప్రాతినిధ్యానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల మంగళవారం హైదరాబాద్‌లో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా ఎమ్మెల్సీ కవితను అభినందించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఎమ్మెల్సీ చేసిన కృషి ఈ విజయానికి కారణమైందన్నారు. ఎమ్మెల్సీ పోరాటం, ప్రయత్నాల వల్లే మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.