Kamareddy – అటు ఎండ ఇటు చలి రైతులు విలవిలాడుతున్నారు

కామారెడ్డి :పగటి పూట ఎండలు వేసవిని తలపిస్తుంటే.. సూర్యాస్తమం కాగానే విపరీతమైన చలి గజగజ వణికిస్తోంది. ఇలా విభిన్నమైన వాతావరణంతో జిల్లా ప్రజలు కష్టాలు పడుతున్నారు.ఇలా మారిన వాతావరణంతో జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలం కావడంతో రోజంతా పొలాల్లో పని చేసే రైతులు ఎండవేడిమికి తట్టుకోలేకపోతున్నారు. చీకట్లో ధాన్యం కుప్పల వద్ద కాపలా ఉండే కర్షకులు చలితో విలవిలలాడుతున్నారు.