Eye test for students-విద్యార్థులకు కంటి పరీక్షలు

నిజామాబాద్ నగర్ : నగరంలోని శంకర్ భవన్ పాఠశాలలో బుధవారం సూర్య హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీతూకిరణ్ పాల్గొని మాట్లాడారు. కంటి చూపు కోల్పోకుండా ఉండేందుకు విద్యార్థులకు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది విద్యార్థుల కళ్లను పరీక్షించి అవసరమైన వారికి కళ్లద్దాలు అందించారు. కంటి వైద్యుడు శ్రీకాంత్, రాజేంద్ర, రవిగౌడ్, పాఠశాల, తదితరులు పాల్గొన్నారు.