Nalgonda – తహసీల్దార్ సమక్షంలో ఏడుగురి బైండోవర్

మోతె :మండలంలోని ఉర్లుగొండ గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులను స్థానిక తహసీల్దార్ ప్రకాష్‌రావు సమక్షంలో రూ.లక్ష హామీ మేరకు బైండోవర్ చేసినట్లు మండల ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వీరిపై గతంలో అనేక కేసులు ఉన్నందున ఎన్నికల నిబంధనల ప్రకారం బైండోవర్ చేశామని ఎస్‌ఐ తెలిపారు. ఎన్నికల సమయంలో పోలీసులకు సహకరించాలన్నారు.