#Nalgonda District

Nalgonda : బడి అంటేనే భయం!

ఇది భూత్పూర్‌ మండలం అమిస్తాపూర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. గతేడాది ఆగస్టులో ‘మన ఊరు – మన బడి’ పథకం కింద ఇక్కడ గుత్తేదారు చేపట్టిన ఇప్పటికీ పూర్తి కాలేదు. కార్యాలయ గదితో పాటు మరో గదికి మరమ్మతులు పూర్తిచేశారు. మరమ్మతులు పూర్తిచేసిన గదిలో గుత్తేదారు నిర్మాణ సామగ్రిని భద్రపరుచుకున్నారు. గత్యంతరం లేకపోవటంతో విద్యార్థులను శిథిలావస్థకు చేరిన గదిలోనే కూర్చోబెట్టి పాఠాలు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడు పైకప్పు పెచ్చులూడి విద్యార్థులపై పడతాయోనని ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. బడి అంటేనే పిల్లలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు నెలలుగా పనులు నిలిచిపోయాయని ప్రధానోపాధ్యాయుడు శివకుమార్‌ తెలిపారు. మొదటి విడత మనఊరు – మనబడి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్‌ రవినాయక్‌ సమీక్ష నిర్వహిస్తూ ఆదేశిస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదనటానికి ఈ పాఠశాలే నిదర్శనం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *