Blindfolded Anganwadi workers protest – కళ్లకు గంతులు కట్టుకొని అంగన్వాడీ ఉద్యోగులు నిరసన

నల్లగొండ టౌన్ : తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మెలో భాగంగా అంగన్వాడీ ఉద్యోగులు ఆదివారం స్థానిక సీడీపీఓ కార్యాలయం ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు తమ సమస్యలను పరిస్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలన్నారు. కార్యక్రమంలో పోలె సత్యనారాయణ, కె.విజయలక్ష్మి, సాదూరి లక్ష్మి, ప్రకృతాంబ, మణిరూప, కళ్యాణి, రేణుక, ప్రమీల, వాణి, నాగమణి, యాదమ్మ, సముద్రమ్మ, జ్యోతి, సరిత, సునీత పాల్గొన్నారు.