love and-marriage-చేసుకునందుకు.. పోయిన ప్రాణం

మర్రిగూడ మండలం అజిలాపురం గ్రామానికి చెందిన ఏడు నెలల గర్భిణి అనుమానాస్పదంగా మృతి చెందిన కేసులో భర్తను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.
మర్రిగూడ (నాంపల్లి), : మర్రిగూడ (marrigadda ) మండలం అజిలాపురం గ్రామానికి చెందిన ఏడు నెలల గర్భిణి అనుమానాస్పదంగా మృతి చెందిన కేసులో భర్తను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. మర్రిగూడ ఎస్సై రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అజిలాపురం వాసి వడ్త్య శ్రీకాంత్, కమ్మగూడెం వాసి సుస్మిత(18)ను ఈ ఏడాది జనవరిలో ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్‌లో నివాసం ఉండే వీరు ఈ నెల 10న అజిలాపురం గ్రామానికి వచ్చారు. ఇరువురి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ అదే రోజు సాయంత్రం సుస్మిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అప్పటికే మృతురాలి బంధువులకు ఫోన్ చేసిన భర్త బీపీ తగ్గిపోవడంతో ఆమె కిందపడిందని చెప్పి, మాల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా తన అక్కకు ఎలాంటి జబ్బులు లేవని, ఆమె మృతి అనుమానాస్పదంగా ఉందని మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. ఏడు నెలల గర్భవతి అని చూడకుండా కర్కషంగా దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు విచారణలో నిందితుడు అంగీకరించడంతో అతడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.