Nagarkurnool – పంటలు నీరు లేక ఎండిపోవడంతో… తుమ్మిళ్ల ఎత్తిపోతలకు అధికారులు చర్యలు చేపట్టారు.

రాజోలి: తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కింద సాగు చేసిన పంటలు నీరు లేక ఎండిపోవడంతో అధికారులు నీటి వసతికి చర్యలు చేపట్టారు. ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి తుమ్మిళ్ల లిఫ్ట్ వద్ద నదిలో పేరుకుపోయిన సిల్ట్(చెత్త)ను తొలగించి వాటర్ ఛానల్‌గా మార్చారు. ఈ చర్యలతో తమిళ్‌ల లిఫ్ట్ వరకు సాగునీరు చేరుతుందని, త్వరలోనే లిఫ్ట్ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని అధికారులు తెలిపారు.