Mahabubnagar – రహదారిని దాటుతున్న మొసలిని బంధించిన యువకులు.

అమరచింత ;మంగళవారం అర్ధరాత్రి పట్టణ శివారులోని విద్యుత్తు ఉపకేంద్రం ఎదుట ద్విచక్రవాహనంపై పొలం నుంచి ఇంటికి వెళ్తున్న రైతులు అమరచింత-మరికల్ ప్రధాన రహదారి దాటుతుండగా మొసలిని బంధించారు. అనంతరం తాళ్లతో కట్టేశారు. పట్టణంలోని పెద్ద చెరువు నుంచి విద్యుత్తు సబ్స్టేషన్ ఎదురుగా ఉన్న చింతల చెరువు వద్దకు మొసలి వలస వస్తోందని వారు తెలిపారు.మొసలిని బంధించిన విషయం బుధవారం ఉదయం పట్టణ వాసులకు తెలియడంతో పలువురు వచ్చి చూశారు. ఎస్సై ఎం.జగన్మోహన్ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు మొసలిని వాహనంలో తీసుకెళ్లి జూరాల ప్రాజెక్టులో వదిలేశారు.