CM – అల్పాహార పథకాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రారంభించారు.

వెల్దండ : మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార కార్యక్రమాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలబాలికలు అల్పాహారం స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మానసిక ఎదుగుదలకు అల్పాహారం ఎంతో మేలు చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శంకర్ నాయక్, మండల తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో శ్రీనివాసులు, సర్పంచ్ భూపతిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.