Komuram bheem Asifabad – కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం.

తానూరు :గురువారం తానూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ సర్పంచి మాధవరావు పటేల్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈసారి కాంగ్రెస్ హయాంలో జరిగిన పరిణామాలను ప్రజలకు తెలియజేయాలని, వాటికి వివరణ ఇవ్వాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ అభ్యర్థి నారాయణరావు పటేల్ గెలుపునకు కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంగమం మండలానికి చెందిన ఛోటాఖాన్ కార్యకర్తలు, పీఏసీఎస్ డైరెక్టర్ పుండ్లిక్ పాల్గొన్నారు.