HUGE RALLY TO VIJAYABHERI ASSEMBLY – విజయభేరి సభకు భారీగా ర్యాలీ

ఖమ్మంమయూరిసెంటర్: హైదరాబాద్ తుక్కుగూడలో ఆదివా రం నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభకు ఉమ్మడి జిల్లాలోని టీపీసీసీ ప్రచార కమిటీ కోచైర్మన్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఈమేరకు వెయ్యికి పైగా కార్లలో పొంగులేటి అభిమానులు, అనుచరులు కార్లలో బయలుదేరారు. వివిధ నియోజకవర్గాల నుంచి వాహనాలు ఖమ్మం చేరుకోగా.. కాంగ్రెస్ మేన్‌ఫెస్టో కమిటీ సభ్యుడు మువ్వా విజయబాబు, క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికి ముందుకు సాగారు.