#Hyderabad District

State Minister KTR and TPCC president Revanth Reddy fought on Twitter – మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నడుమ ట్విట్టర్‌ వేదికగా యుద్ధమే జరిగింది

హైదరాబాద్‌: విజయభేరి పేరుతో తుక్కు­గూడలో నిర్వహించిన భారీ బహిరంగసభ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నడుమ ట్విట్టర్‌ వేదికగా యుద్ధమే జరిగింది. మోసం, వంచన, ద్రోహం, దోఖాల మయం కాంగ్రెస్‌ అర్ధ శతాబ్దపు పాలనంతా అని  కేటీఆర్‌ ట్వీట్‌ చేస్తే తెలంగాణ కోసం తల్లి సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలను చూసి అర్ధరాత్రి నుంచి అయ్యా కొడుకులు అంగీలు చింపుకుంటున్నారని రేవంత్‌ రీట్వీట్‌ చేశారు.

మీ కపట కథలు చెల్లవిక్కడ: కేటీఆర్‌
కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ కేటీఆర్‌ సుదీర్ఘంగా ట్వీట్‌ చేశారు.‘ఇది మీ కపట కథలు, కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన తెలివైన తెలంగాణ గడ్డ, కల్లబొల్లి గ్యారంటీలు చెల్లవ్‌ ఇక్కడ’ అంటూ తన ట్వీట్‌ను మొదలుపెట్టిన కేటీఆర్‌.. రాబందుల రాజ్యమొస్తే రైతుబంధు రద్దవడం గ్యారంటీ, కాల­కేయుల కాలం వస్తే కరెంట్‌ కోతలు, కటిక చీక­ట్లు గ్యారంటీ, మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంటల కరెంటే గతి, ఉచిత విద్యుత్‌ ఊడ­గొట్టడం గ్యారంటీ,, బకాసురులు గద్దెనెక్కితే రైతు­బీమా, ధీమా గల్లంతవ్వడం గ్యారంటీ, సమర్థత­లేని సన్నాసులకు ఓటేస్తే సకల రంగాల్లో సంక్షోభం గ్యారంటీ, ఢిల్లీ కీలుబొమ్మలు కుర్చీఎక్కితే ఆత్మగౌరవాన్ని అంగట్లో తాకట్టు పెట్టడం గ్యారంటీ, స్కాముల పార్టీకి  స్వాగతం చెబితే, స్కీము­లన్నీ  ఎత్తేయడం గ్యారంటీ,  పనికిమాలిన వాళ్లు పవర్‌లోకి వస్తే పరిశ్రమలు పారిపోవడం గ్యారంటీ, థర్డ్‌ గ్రేడ్‌ నాలాయక్స్‌ను నమ్ముకుంటే ప్రథమ స్థానంలో ఉన్న స్టేట్‌ అధమ స్థాయికిపోవడం గ్యారంటీ, జోకర్లకు, బ్రోకర్లకు పీఠం ఇస్తే పరువు ప్రతిష్టలు గంగలో కలవడం గ్యారంటీ, దాచి దాచి దెయ్యాలకు పెట్టేంత ఎడ్డిది కాదు.. ఈనగాచి నక్కల పాలుజేసేంత అమాయక నేల కాదు నా తెలంగాణ, జై తెలంగాణ అంటూ ముగించారు. 

పదేళ్లలో వందేళ్ల విధ్వంసం సృష్టించారు: రేవంత్‌
మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు ఘాటుగానే స్పందించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌. ‘మా నాయ­కుడు రాహుల్‌గాంధీ చెప్పిన విధంగా రాబోయే 100 రోజుల్లో అంటూ తన ట్వీట్‌ను ప్రారంభించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని దోఖా ఇచ్చిన దగాకోరును గద్దె దించడం గ్యారంటీ, మూ డెకరాల భూమి మాట తప్పి, వేల ఎకరాలు వె­నకేసిన భూబకాసురులను బొందపెట్టడం గ్యారంటీ, కమీషన్లను దండుకోవడమే  మిషన్‌గా పె ట్టుకున్న వసూల్‌ రాజాల భరతం పట్టడం గ్యారంటీ, పదేళ్లలో వందేళ్ల విధ్వంసం సృష్టించిన వినా శకారులను పాతరేయడం గ్యారంటీ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టిన  ’గు­లామీ’ గ్యాంగ్‌ను పాతాళానికి తొక్కడం  గ్యా­రం­టీ, అధికారం శాశ్వతం అనుకుని నీలిగిన నిజాం రాచ రికాన్నే పీచమణిచిన గడ్డ ఇది.. మీ­రొక లెక్కా..? అధికారంలోకి వస్తున్నాం.. అన్ని గ్యారంటీలు అమలు చేస్తున్నాం. జై కాంగ్రెస్‌! జై తెలంగాణ!  అంటూ రేవంత్‌ తన ట్వీట్‌ను ముగించారు.

State Minister KTR and TPCC president Revanth Reddy fought on Twitter – మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నడుమ ట్విట్టర్‌ వేదికగా యుద్ధమే జరిగింది

IT employees and TDP ranks protested in

Leave a comment

Your email address will not be published. Required fields are marked *