Hyderabad – దసరాను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు

దిల్‌సుఖ్‌నగర్;దిల్‌సుఖ్‌నగర్‌లోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరాను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఐదవ రోజు వేడుకలో దుర్గమ్మ లలితా త్రిపుర శోభతో వెలిసింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు అమ్మవారికి కుంభహారతి, నక్షత్ర హారతి సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు.