Another person died in the gas leakage incident – గ్యాస్ లీకేజీ ఘటనలో మరొకరు మృతి

ఫిలింనగర్: ఫిలింనగర్‌లోని మహాత్మగాంధీనగర్ వడ్డెర బస్తీలో సోమవారం తెల్లవారుజామున గ్యాస్ లీకేజీ ఘటనలో ఆస్పత్రిలో చికిత్స పొందు తూ మంగళవారం మరొకరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి..మహాత్మగాంధీనగర్ వడ్డెర బస్తీలో నివాసం ఉంటున్న రమేష్ చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి వద్ద కారు డ్రైవర్‌గా పని చేస్తు న్నాడు. ఆదివారం రమేష్(38), అతడి భార్య శ్రీలత(32), కుమారుడు హర్షవర్ధన్(13), కూతు రు సీతామహాలక్ష్మి(8) ఇంట్లో నిద్రపోయారు. సోమవారం ఉదయం రమేష్ నిద్ర లేచి లైట్ వేయగా అప్పటికే గ్యాస్ లీకై ఇళ్లంతా వ్యాపించి ఉండటంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నా యి.
వారు అప్రమత్తమై బయటికి పరుగుతీసేలో గా నిప్పంటుకుని రమేష్, అతడి భార్య శ్రీలత తీవ్రంగా గాయపడ్డారు. రమేష్ చికిత్స పొందు తూ సోమవారం మృతి చెందాడు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీలత మంగళవారం మధ్యాహ్నం కన్నుమూసింది. కుమారుడు హర్షవర్ధన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనలో వడ్డెర బస్తీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి మంగళవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.