Alert for Telangana Heavy rains for five days – తెలంగాణకు అలర్ట్.. ఐదు రోజులు భారీ వర్షాలే..

హైదరాబాద్: గత కొద్దిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చెరువులు, నదులు నిండి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తెలంగాణలో వచ్చే ఐదురోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
వాతావరణ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం నుంచి కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. నేటిం నుంచి శనివారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మంగళవారం నిజామాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, జయశంకర్ జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది.