Adilabad – 40 కిలోల గంజాయి పట్టివేత..సీఐ అశోక్.

ఆదిలాబాద్ ;రైలు మార్గంలో తరలిస్తున్న ఎండు గంజాయిని ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రెండో నగర సీఐ అశోక్, ఎస్సై ప్రదీప్ కుమార్ ఆదిలాబాద్ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో 40 కిలోల గంజాయి లభించగా, నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్టేషన్‌కు తీసుకొచ్చి కేసు నమోదు చేశారు. ఇద్దరు మహారాష్ట్ర, ముగ్గురు ఒడిశాకు చెందిన వారని డీఎస్పీ ఉమేందర్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.