Vizag – రూ.1.30కోట్లు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

విశాఖపట్నం నుంచి విజయవాడకు ఆటోలో తరలిస్తున్న రూ.1.30కోట్ల నగదును విశాఖ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ఓ ఎలక్ట్రానిక్ దుకాణానికి సంబంధించిన డబ్బుగా దీన్ని గుర్తించారు. ఆటోలో వాషింగ్ మెషిన్‌ను ఉంచి అందులో నగదు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో విశాఖ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వాషింగ్ మెషిన్‌లో ఉంచి తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన బిల్లులు చూపించకపోవడంతో సీఆర్‌పీసీ 41, 102 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నగదును ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు.