#Crime News

killed suicide-కుల దూషణలకు యువకుడు దారుణ ఆత్మ హత్య..

నందవరం: కుల దూషణలకు ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన మండలంలోని నాగలదిన్నె తండాలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ తిమ్మయ్య, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నాగలదిన్నె గ్రామానికి చెందిన మాల పరాశరాముడు, పార్వతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కుమార్తె రేణుకను రెండు నెలల క్రితం బోయ మారెప్ప అనే యువకుడు అపహరించాడు. ఎమ్మిగనూరు టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యమైన వ్యక్తి ఫిర్యాదు అందడంతో పోలీసులు వారిద్దరినీ తీసుకొచ్చి కౌన్సెలింగ్‌ చేసి వారి స్వస్థలాలకు పంపించారు.

అయితే మరుసటి రోజు రేణుక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి మారెప్ప పరాశరాముడి కుటుంబ సభ్యులను కులం పేరుతో దూషించేవాడు. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో కూడా పరాశరామ్ తన రెండో కుమారుడు మహేష్ కుమార్ (22)ని తిట్టి, అవమానించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఉదయం 9:00 గంటల ప్రాంతంలో గ్రామ బయట ఉన్న తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *