#Crime News

Odisha police AP – ఒడిశా నుంచి ఏపీకి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లకు ఒడిశా

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(AOB)ల్లో ‘పుష్ప’ సినిమా తరహా సీన్‌ చోటుచేసుకుంది. ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లకు ఒడిశా పోలీసులు చుక్కలు చూపించారు. చిత్రకొండ పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యాన్ ఆగకుండా దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మరో వాహనంలో వారిని వెంబడించారు. అయితే, స్మగ్లర్లు తప్పించుకునేందుకు గంజాయి మూటలను రోడ్డుకు అడ్డంగా ఒక్కోటి చొప్పున వేసుకుంటూ పోయిన పోలీసులు వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లారు. ఇదంతా వీడియోలో రికార్డు అయింది. ఈ సందర్భంగా దాదాపు రూ.కోటి విలువైన గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. ఏవోబీలో గంజాయి స్మగ్లర్లను పోలీసులు తరిమిన దృశ్యాలు.. ‘పుష్ప’ చిత్రంలో ఎర్రచందనం తరలిస్తుండగా అల్లు అర్జున్‌ను పోలీసులు వెంబడించిన దృశ్యాన్ని తలపించేలా ఉంది. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *