Crime – భార్యను భర్త కత్తితో పొడిచి చంపాడు

నాగోలు పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక సాయినగర్‌లో భార్యను భర్త కత్తితో పొడిచి చంపాడు. అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. సరూర్‌నగర్‌లోని తపోవన్ కాలనీలో భవనంపై నుంచి దూకి భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు కుటుంబకలహాలే కారణమని తెలుస్తోంది.