Attack : ఓ వివాహితపై దుండగులు కత్తులతో దాడి

గుంటూరులోని ఎల్ఐసీ కాలనీలో ఓ వివాహితపై దుండగులు కత్తులతో దాడి చేశారు. మధుకుమారి అనే మహిళ తన కుమారుడిని పాఠశాలలో వదిలి స్కూటీపై వస్తుండగా.. ఆమెను నలుగురు దుండగులు అడ్డగించారు. స్కూటీ ఆపగానే ఆమెపై కత్తులతో దాడి చేశారు. ఒక్కసారిగా పొడవటంతో మధుకుమారి గట్టిగా కేకలు వేశారు. దీంతో దుండగులు అక్కడి నుంచి బైక్‌లపై పరారయ్యారు. స్థానికులు బాధితురాలిని జీజీహెచ్‌కు తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలో తన భర్తతో విబేధాలు ఉండేవని, ఇప్పుడు కలిసే ఉంటున్నట్లు బాధితురాలు పేర్కొన్నారు. దాడి చేసిన వారెవరో తెలియదని చెప్పారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.