#Crime News

Rajasthan – రాజస్థాన్‌లోని పహాడీ సబ్‌ డివిజన్‌లో సామూహిక అత్యాచారానికి

రాజస్థాన్‌లోని పహాడీ సబ్‌ డివిజను పరిధిలో ఓ వితంతువును వంచించిన ఆరుగురు కామాంధులు 14 రోజులపాటు ఆమెపై సామూహిక అత్యాచారం సాగించారు. భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో నిరాధారంగా మారిన ఆమెకు ఉద్యోగం ఆశ చూపి ఓ వ్యక్తి చేరువయ్యాడు. తన అయిదుగురు స్నేహితులతో కలిసి కుట్ర పన్నిన ఆ వ్యక్తి.. ఆమెకు శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చి భరత్‌పుర్‌లోని ఓ హోటలుకు తీసుకువెళ్లాడు. బాధితురాలిని అక్కడే నిర్బంధించి ఈ ఆరుగురూ అఘాయిత్యాలకు పాల్పడినట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు. వారి ఉచ్చు నుంచి బయటపడిన ఆమె కామా పోలీసుస్టేషనులో నిందితుల పేర్లతో సహా ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని డీఎస్పీ దేశ్‌రాజ్‌ కుల్దీప్‌ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *