#Cinema

Vishwak sen Gang of godavari song release : కుర్రాళ్ళ గుండెల్లో మోత మోగించే పాట విడుదల చేసిన విశ్వక్‌

టాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్‌ హీరో విశ్వక్‌సేన్‌ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. రీసెంట్‌గా ‘గామి’ చిత్రంలో అఘోరా పాత్రలో నటించిన విశ్వక్‌ ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా ఆయన నటించిన మరో కొత్త చిత్రం విడుదలకు రెడీగా ఉంది. విశ్వక్‌,  నేహాశెట్టి జంటగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ నుంచి తాజాగా అదిరిపోయే సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

‘మోత మోగిపోద్ది..’ అంటూ సాగే మాస్ ఐటెం సాంగ్  నెట్టింట దుమ్మురేపుతుంది. ఈ పాటలో విశ్వక్‌తో  అయేషా ఖాన్ తన అందచందాలతో స్టెప్పులేసింది.  చంద్రబోస్ రాసిన ఈ పాటకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. రంగస్థలం సినిమాలో ‘రంగమ్మా మంగమ్మా’ పాటతో మెప్పించిన ‘ఎమ్‌ఎమ్‌ మానసి’ ఇప్పుడు ‘మోత మోగిపోద్ది..’ అంటూ అదిరిపోయే సాంగ్‌ పాడింది.

ఇటీవలే ఓం భీమ్ బుష్ సినిమాలో ప్రియదర్శి సరసన కనిపించిన అయేషాఖాన్ ఆ సినిమాతో బాగా పాపులర్‌ అయింది. ఇప్పుడు ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’లో ఈ ఐటమ్‌ సాంగ్‌తో మోత మోగిపోయేలా స్టెప్పులు వేసింది. మే 17న ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ విడుదల అవుతుందని మేకర్స్‌ ప్రకటించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *