#Cinema

Trisha Sequel : సీక్వెల్‌లో త్రిష?

‘అమ్మోరు తల్లి’గా అగ్ర కథానాయిక నయనతార అలరించిన సంగతి తెలిసిందే.

‘అమ్మోరు తల్లి’గా అగ్ర కథానాయిక నయనతార అలరించిన సంగతి తెలిసిందే. ఫాంటసీ కామెడీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రాన్ని ఆర్‌జే బాలాజీ ప్రధాన పాత్రలో నటిస్తూ..స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. 2020లో వచ్చిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కొనసాగింపు చిత్రం కోసం చిత్రబృందం పూర్వనిర్మాణ పనుల్ని కూడా ప్రారంభించినట్లు సమాచారం. మరి నయనతార పోషించిన పాత్రను ఎవరు చేస్తారన్న ప్రశ్నకు సమాధానంగా..అగ్రతార త్రిష పేరు ప్రచారంలో ఉంది. ‘మంచి కథాంశంతో, ఆలోచనాత్మక సందేశంతో రానున్న ఈ చిత్రంలో త్రిష పాత్ర మరింత అందంగా ఉంటుంది. ఈ సినిమాలో తను భాగం కావడం ఆనందంగా ఉంది’ అని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరి ఈమె ఈ ప్రాజెక్టులో భాగం కానుందో లేదో తెలియాలంటే చిత్రబృందం అధికారికంగా తెలిపే వరకూ ఆగాల్సిందే. ప్రస్తుతం ‘విశ్వంభర’, ‘థగ్‌లైఫ్‌’, ‘ఐడెంటిటీ’, ‘రామ్‌’ లాంటి చిత్రాలతో బిజీగా గడుపుతోంది త్రిష.  

Leave a comment

Your email address will not be published. Required fields are marked *