Trailer of emotional drama ‘Maidan’ తెరపైకి హైదరాబాదీ బయోగ్రఫీ.. ఆకట్టుకుంటోన్న స్పోర్ట్స్, ఎమోషనల్ డ్రామా ‘మైదాన్’ ట్రైలర్

బయటి ప్రపంచానికి అంతగా తెలియని మన హైదరాబాదీ రియల్ హీరో సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్రతో రూపొందించిన చిత్రం‘మైదాన్’. అజయ్ దేవగన్ లీడ్ క్యారక్టర్ పోషించారు.ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కు దేశవ్యాస్తంగా మంచి స్పందన వస్తోంది.

యథార్థ ఘటనల ఆధారంగా ఈ ‘మైదాన్’ సినిమాను ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ రవీందర్నాథ్ శర్మ తెరకెక్కించగా, ప్రియమణి , గజరాజ్ రావు, ప్రసిద్ధ బెంగాలీ నటుడు రుద్రనీల్ ఘోష్ నటించారు. మైదాన్ ట్రైలర్‌ను గురువారం నాడు రిలీజ్ చేశారు. సయ్యద్ అబ్దుల్ రహీమ్ అద్భుతమైన ప్రయాణాన్ని తెరపై అంతే అద్భుతంగా చూపించారు. అబ్దుల్ రహీమ్ అద్భుతమైన ప్రయాణాన్ని, ఫుట్ బాల్ ఆటను I MAX లోనూ చూసేవిధంగా తెరకెక్కించడం విశేషం.

జీ స్టూడియోస్, బోనీ కపూర్, అరుణవ జాయ్ సేన్‌గుప్తా (Arunava Joy Sengupta), ఆకాష్ చావ్లా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, సాయివిన్ క్వాడ్రాస్, రితేష్ షాలు స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లను అందించారు. ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) సంగీతం, మనోజ్ ముంతాషిర్ శుక్లా సాహిత్యం అందజేశారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది రంజాన్ పండుగ నాడు థియేటర్లలో విడుదల చేయనున్నారు.