Tapsee: Tapsee Marriage తాప్సీ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్

తాప్సీ పెళ్లి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సినీ నటి తాప్సీ ఇటీవల సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ప్రియుడు మథియాస్ బోతోను వివాహమాడారు. మార్చి 20న వీరి ప్రీవెడ్డింగ్ వేడుకలు జరిగాయి. 23న ఉదయ్‌పుర్‌లో తాప్సీ- మథియాస్ బోతో పెళ్లి జరిగింది. తాజాగా ఆమె పెళ్లికి సంబంధించిన వీడియో లీకైంది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

పెళ్లిలో తాప్సీ ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. కూలింగ్ గ్లాస్ పెట్టుకొని ఫుల్ జోష్‌తో డ్యాన్స్ చేస్తూ వేదికపైకి చేరుకున్నారు. వరుడు మథియాస్ సింపుల్ డ్రెస్‌లో స్వాగతం పలికారు. ఇద్దరూ దండలు మార్చుకొని ఒక్కటయ్యారు. తాప్సీ బెస్ట్ ఫ్రెండ్, ప్రొడ్యూసర్ కనిక ఇటీవల కొన్ని ఫొటోలు షేర్ చేసి వాటికి ‘నా స్నేహితుల పెళ్లిలో’ అని క్యాప్షన్ పెట్టడంతో ఈ విషయం బయటకు వచ్చింది. తర్వాత జరిగిన హోలీ వేడుకల్లో తాప్సీ సింధూరం పెట్టుకొని కనిపించారు. దక్షిణాది నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమయంలోనే తాప్సీకు మథియాస్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పదేళ్లు రిలేషన్‌లో ఉన్న తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

‘ఝుమ్మంది నాదం’తో వెండితెరకు పరిచయమయ్యారు తాప్సీ (Taapsee Pannu). ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే, అవేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో తాప్సీ బాలీవుడ్‌కు (Bollywood) మకాం మార్చారు. అక్కడ మంచి విజయాలు సాధిస్తూ.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు హీరోయిన్‌గా నటిస్తూనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.