Suicide – ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’.

రామ్ కార్తిక్, హెబ్బాపటేల్ కీలక పాత్రల్లో విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించిన మిస్టరీ థ్రిల్లర్ ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ (The Great Indian Suicide). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 6వ తేదీ నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా ట్వీట్ చేసింది. ప్రచార చిత్రం చూస్తుంటే, ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాను తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది.
ఇక చిత్ర కథ అనూహ్య రీతిలో సాగుతుందని అర్థమవుతోంది. ఇంతకీ ఈ సినిమా నేపథ్యం ఏంటంటే.. ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. అసలు వాళ్ల ఉద్దేశం ఏంటి?మళ్లీ పుట్టడమేనా?ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇలా అనూహ్యమైన ట్విస్టులు, సస్పెన్స్, డ్రామా, రొమాన్స్ తదితర అంశాలను మేళవించి తాజా చిత్రాన్ని తీర్చిదిద్దారు. మదనపల్లె పట్టణంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ తెరకెక్కింది. నటులు నరేష్ వీకే, పవిత్రా లోకేష్ ఈ సినిమాలో భార్య భర్తలుగా కనిపించనున్నారు.