#Cinema

SSRMB: Who is stopping Mahesh and Rajamouli’s movie?మహేష్, రాజమౌళి సినిమాను ఆపుతున్నదెవరు

చూస్తుండగానే RRR విడుదలై రెండేళ్లైపోయింది. అదే వేరే దర్శకుడిని అయితే నెక్ట్స్ సినిమా ఎప్పుడంటూ మెంటల్ ఎక్కించేవాళ్లు. కానీ అక్కడున్నది రాజమౌళి. నెక్ట్స్ సినిమా ఎప్పుడనే ఆలోచనే రాకుండా ఈయన మేనేజ్ చేస్తున్నారు. సినిమాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉన్నారు. ఈ విషయంలో రాజమౌళికి మాత్రమే తెలిసిన ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ ఏంటి..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. ఏదైనా అడిగిన వెంటనే ఇచ్చేస్తే మజా ఉండదంటారు. అందుకేనేమో రాజమౌళి కూడా తన సినిమాల విషయంలో ఇదే సూత్రాన్ని ఫాలో అవుతుంటారు.

చూస్తుండగానే RRR విడుదలై రెండేళ్లైపోయింది. అదే వేరే దర్శకుడిని అయితే నెక్ట్స్ సినిమా ఎప్పుడంటూ మెంటల్ ఎక్కించేవాళ్లు. కానీ అక్కడున్నది రాజమౌళి. నెక్ట్స్ సినిమా ఎప్పుడనే ఆలోచనే రాకుండా ఈయన మేనేజ్ చేస్తున్నారు. సినిమాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉన్నారు. ఈ విషయంలో రాజమౌళికి మాత్రమే తెలిసిన ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ ఏంటి..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

ఏదైనా అడిగిన వెంటనే ఇచ్చేస్తే మజా ఉండదంటారు. అందుకేనేమో రాజమౌళి కూడా తన సినిమాల విషయంలో ఇదే సూత్రాన్ని ఫాలో అవుతుంటారు. వస్తుంది వస్తుందంటూ ఊరించడం.. ఇదిగో అదిగో అని చెప్పడం.. ఇవన్నీ రాజమౌళికి మాత్రమే తెలుసు. మహేష్ సినిమాకు ఇదే చేస్తున్నారు జక్కన్న. అప్పట్లో ట్రిపుల్ ఆర్ అనౌన్స్‌మెంట్‌కు ముందు ఏడాది ఊరించారు రాజమౌళి.

దేశమంతా తన సినిమా గురించే మాట్లాడుకునేలా చేస్తారు రాజమౌళి. అలా వెయిట్ చేయించి కావాల్సిందివ్వడం అలవాటుగా చేసుకున్నారీయన. ప్రతీసారి ఇదే చేస్తున్నారు. SSMB 29 అప్‌డేట్స్ ఏంటని అడుగుతుంటే.. ఏమీ పట్టనట్లు తన పని తాను చేసుకుంటున్నారు జక్కన్న. టైమ్ వచ్చినపుడు చెప్తానంటూ తప్పించుకుంటున్నారు దర్శక ధీరుడు.

2023 డిసెంబర్ నుంచే ఆర్నెళ్ల పాటు వర్క్ షాప్‌ ఉంటుందన్నారు.. సమ్మర్‌లో ఓపెనింగ్ చేసి షూటింగ్ మొదలుపెడతామన్నారు. చూస్తుంటే అవేం లేవు.. చాలా కూల్‌గా ఉంది పరిస్థితి. తాజాగా ప్రేమలు ఈవెంట్‌లో SSMB29 గురించి చర్చే లేదు. పైగా స్పీడ్ అనేది తనకు అలవాటు లేని పనంటూ కొడుకు కార్తికేయపైనే సెటైర్ వేసారు రాజమౌళి.

మరోవైపు మహేష్ కూడా తన యాడ్స్ చేసుకుంటున్నారు. కుదిర్తే ఇంకా ట్రిప్స్ కూడా ప్లాన్ చేసేలా ఉన్నారు. లుక్ టెస్ట్ కూడా ఇంకా అయినట్లు లేదు. మొన్నటి వరకు గడ్డంతో కనిపించిన మహేష్.. ఇప్పుడేమో న్యూ లుక్‌లోకి వచ్చేసారు. ఇదంతా చూస్తుంటే SSMB29 ఇప్పట్లో లేనట్లే. కానీ రాజమౌళి మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటారు. అదే మరి మ్యాజిక్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *