Rashmika video from Pushpa movie leaked పుష్ప సినిమా నుంచి రష్మిక వీడియో లీక్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- రష్మిక మందన్న కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప-2. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2021లో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘పుష్ప: ది రైజ్’ మూవీకి సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్’ రూపొందుతోంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక లుక్ లీకైంది.. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని యాగంటి క్షేత్రంలో ‘పుష్ప: ది రూల్’ సినిమా షూటింగ్ సందడి నెలకొంది. అక్కడే ఈ ఫోటో లీక్ అయినట్లు తెలుస్తోంది. ఫోటోతో పాటు వీడియో కూడా లీక్ అయింది. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ యాగంటి, వైజాగ్ తదితర ప్రాంతాల్లో జరుగుతోంది. యాగంటి క్షేత్రంలోని గుహలో కొలువైన శ్రీ వెంకటేశ్వరస్వామికి హీరోయిన్ రష్మిక మందన్నా బంగారు కిరీటాన్ని బహూకరించే సన్నివేశాలను తెరకెక్కించారు సుకుమార్. పుష్ప టీమ అక్కడకు వస్తుందని తెలియడంతో భారీగా ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో కొందరు వీడియో తీయడంతో అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.