#Cinema

Ramayana: Ramayanam movie shooting has started..రామాయణం మూవీ షూటింగ్ షురూ..

ఇతిహాసాల ఆధారంగా సినిమాలు, సిరీస్ లు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు కొత్త టెక్నాలజీల వినియోగంతో ‘రామాయణం’ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం నితీష్ తివారీ బాలీవుడ్‌లో ‘ రామాయణం ‘ సినిమా చేస్తున్నాడు . దీనికి సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. ఇందుకోసం భారీ సెట్లు వేశారు.

ఇతిహాసాలు ‘రామాయణం’, ‘మహా భారతం’ ఆధారంగా చాలా సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.. చాలా సీరియల్స్ కూడా వచ్చాయి. ఇతిహాసాల ఆధారంగా సినిమాలు, సిరీస్ లు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు కొత్త టెక్నాలజీల వినియోగంతో ‘రామాయణం’ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం నితీష్ తివారీ బాలీవుడ్‌లో ‘ రామాయణం ‘ సినిమా చేస్తున్నాడు . దీనికి సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. ఇందుకోసం భారీ సెట్లు వేశారు. ఈ సినిమాలో నటించే నటీ నటుల గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ నుంచి ఈ ఫోటో లీక్ అయింది.

‘రామాయణం’  సినిమా పై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా.. సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుంది. మరీ ముఖ్యంగా రావణుడి పాత్రలో యష్ నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. బీ టౌన్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఈ సినిమా మూడు భాగాలుగా రానుందని, రెండో భాగంలో రావణుడి ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. తాజాగా సెట్‌కు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.

‘రామాయణం’ సినిమా షూటింగ్ మంగళవారం (ఏప్రిల్ 3) ప్రారంభమైంది. ఈ సినిమా కోసం ముంబైలో భారీ సెట్స్ వేశారు. పూజా కార్యక్రమాల అనంతరం షూటింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం చిన్న చిన్న పాత్రల చిత్రీకరణ జరుగుతోందని తెలుస్తోంది. త్వరలో రణబీర్ కపూర్ సెట్‌లో జాయిన్ అవుతాడని అంటున్నారు. ఇప్పుడు వైరల్‌గా మారిన ఈ సెట్ ఫోటో బయటి నుంచి తీసిన ఫోటో. కాగా ‘రామాయణం’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఆదిపురుష’ సినిమా విడుదలైన తర్వాత ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి నితీష్ తివారీ చాలా జాగ్రత్తగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Ramayana: Ramayanam movie shooting has started..రామాయణం మూవీ షూటింగ్ షురూ..

Former Mla Shakeel Son : Put the

Leave a comment

Your email address will not be published. Required fields are marked *