#Cinema

Rakul Preet Singh: Married.. Are you wearing formal clothes? పెళ్లయిపోయింది.. మరి పద్ధతైన దుస్తులు వేసుకుంటున్నారా?


చాలామంది అమ్మాయిలు పెళ్లంటేనే భయపెడతారు. ఎందుకు? పెళ్లి తర్వాత స్వేచ్ఛ ఉండదని, అనేక కట్టుబాట్లు ఉంటాయని, తమ జీవితం అవతలివారి చేతుల్లోకి వెళ్లిపోతుందని! పెళ్లికి ముందు, తర్వాత.. జీవితం ఒకేలా ఉండదన్నదే వారి ప్రధాన భయం! అయితే ఇది కేవలం అపోహే అని కొట్టిపాడేయలేం.. పెళ్లి తర్వాత కూడా హ్యాపీగా, జాలీగా తమకు నచ్చినట్లు ఉన్నవాళ్లు ఉన్నారు. ఇష్టం ఉన్నా, లేకపోయినా అవతలివారికి నచ్చినట్లు మెదులుకునేవారూ ఉన్నారు.

పెళ్లిని ఎందుకని..
ఇప్పుడిదంతా ఎందుకంటే? ఈ మధ్యే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన హీరోయిన్‌  రకుల్ ప్రీత్ సింగ్ కు ఓ ప్రశ్న ఎదురైంది. పెళ్లయ్యాక మీ ఇంట్లో నీ వేషధారణ (డ్రెస్సింగ్‌ సెన్స్‌) ఏమైనా మార్చుకోమని చెప్పారా? అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగాడు. అందుకు రకుల్‌ మాట్లాడుతూ.. అలా ఎవరూ చెప్పలేదు. పుట్టింట్లో, అత్తింట్లో నాకు నచ్చినట్లు ఉండేలా స్వేచ్ఛనిచ్చారు. మన సమాజమే పెళ్లిని పెద్ద విషయంగా చూస్తోంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఒక సహజ ప్రక్రియలా భావిస్తే సరిపోతుంది.

అమ్మాయిలనే ఎందుకడుగుతారు?
అలాగే పెళ్లి తర్వాత.. ధగధగ మెరిసే షేర్వాణీలే ధరించాలని మగవాళ్లకు చెప్పగలరా? చెప్పరు కదా.. మరి ఆడవాళ్ల విషయంలో మాత్రం ఎందుకు ప్రత్యేక శ్రద్ధ పెడతారు? కాలం మారింది.. ఎవరికి నచ్చినట్లు వాళ్లుంటారు. ఎవరికి ఇష్టమైన బట్టలు వారు వేసుకుంటారు’ అని చెప్పుకొచ్చింది. కాగా రకుల్‌ ఫిబ్రవరి 21న గోవాలో ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లాడింది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

Rakul Preet Singh: Married.. Are you wearing formal clothes? పెళ్లయిపోయింది.. మరి పద్ధతైన దుస్తులు వేసుకుంటున్నారా?

ED : There is no violation of

Leave a comment

Your email address will not be published. Required fields are marked *