#Cinema

Rajamouli’s interesting comments about Malayali actors

పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి.. ‘ప్రేమలు’ అనే డబ్బింగ్ సినిమాను తెగ పొగిడేశారు. ఇందులో యాక్టర్స్ ఒక్కొక్కరి గురించి డీటైల్డ్‌గా మాట్లాడారు. ఈ క్రమంలోనే మలయాళ యాక్టర్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. ఓ విషయంలో మాత్రం చాలా బాధపడుతున్నానని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘కొంచెం జెలసీ, బాధతో ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ గొప్ప యాక్టర్స్‌ని ఇస్తూ ఉంటుంది. అక్కడ నటించే వాళ్లంతా చాలా బాగా నటిస్తారు. అలానే ఈ సినిమాలో చేసిన నస్లెన్, మమిత, శ్యామ్ మోహన్, సంగీత ప్రతాప్.. తమ యాక్టింగ్‌తో అదరగొట్టేశారు. మేం యాక్షన్ సీన్స్‌తో చాలా కష్టపడుతుంటాం. కానీ వీళ్లు చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌తో థియేటర్లలో విజిల్స్ అందుకుంటున్నారు. హీరోయిన్ మమిత అయితే.. ‘గీతాంజలి’లో గిరిజ, ఆ తర్వాత వచ్చిన సాయిపల్లవిని గుర్తు చేసింది’ అని రాజమౌళి అన్నారు.

ఈ సినిమాని తెలుగులో ఎంత తన కొడుకు కార్తికేయ రిలీజ్ చేసినా సరే రాజమౌళి నుంచి ఈ రేంజు ప్రశంసలు వస్తాయని మాత్రం ‘ప్రేమలు’ టీమ్ ఊహించి ఉండరు. అలానే రాజమౌళి కామెంట్స్‌తో మలయాళ యాక్టర్స్ కూడా గాల్లో తేలుతూ ఉంటారేమో. అయితే యాక్టింగ్ పరంగా మలయాళీస్ బెస్ట్ అయి ఉండొ‍చ్చు కానీ ఆడియెన్స్ పరంగా తెలుగోళ్లని కొట్టేవాళ్లు ప్రపంచంలోనే లేరని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Rajamouli’s interesting comments about Malayali actors

Comedians as Heros

Leave a comment

Your email address will not be published. Required fields are marked *