#Cinema

Raghava Lawrence: నా గురువు, తలైవా రజనీకాంత్‌ను కలిశాను.

కథానాయకుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ నటించిన తాజా చిత్రం ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2). సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో స్టార్‌ హీరో రజనీకాంత్‌ (Rajinikanth) ఇంటికి వెళ్లిన లారెన్స్‌ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

‘నా గురువు, తలైవా రజనీకాంత్‌ను కలిశాను. ‘జైలర్‌’ సూపర్‌ హిట్‌ సాధించినందుకు అభినందనలు తెలిపాను. అలాగే ‘చంద్రముఖి-2’ విడుదల నేపథ్యంలో ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను. ఎంతో సంతోషంగా ఉంది. ఆయన చాలా గొప్ప వ్యక్తి’ అని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఈ ఫొటోలు చూసిని అభిమానులు ‘గురువుకు తగ్గ శిష్యుడంటూ కామెంట్స్‌ పెడుతున్నారు’. ఇక రజనీకాంత్‌ 2005లో నటించిన ‘చంద్రముఖి’ (Chandramukhi)కి సీక్వెల్‌గా ఈ సినిమా రానున్న సంగతి తెలిసిందే.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *