Raghava Lawrence: నిరుపేద మహిళకు అండగా లారెన్స్..

లారెన్స్‌ను ఆదర్శంగా తీసుకుని కోలీవుడ్ కమెడియన్ కేపీవై బాల అనే యువకుడు కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తున్నాడు. తన సంపాదనలో చాలావరకు నిరుపేదలకు సాయం చేయడానికి ఉపయోగిస్తున్నాడు. పిల్లల చదువులు, నిస్సహాయులైన వృద్ధులను ఆదుకోవడం, వికలాంగులకు సహాయం చేయడం, తగిన వైద్య సదుపాయాలు లేని ప్రదేశాలకు అంబులెన్స్‌లు కొనుగోలు చేయడం, వైద్య సహాయం చేశాడు.
కోలీవుడ్ హీరో కమ్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ గురించి చెప్పక్కర్లేదు. సహజ నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటు తెలుగులోనూ లారెన్స్‌కు ఫ్యాన్ బేస్ ఉంది. నిజ జీవితంలోనూ లారెన్స్ హీరో అన్న సంగతి తెలిసిందే. సామాకి సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు లారెన్స్. ఇప్పటికే తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది చిన్నారులను చదివిస్తున్నాడు. తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు ఆపద్భాంధవుడు అయ్యాడు. నిరుపేద వృద్దులకు తనవంతూ సాయం చేస్తున్నారు. లారెన్స్‌ను ఆదర్శంగా తీసుకుని కోలీవుడ్ కమెడియన్ కేపీవై బాల అనే యువకుడు కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తున్నాడు. తన సంపాదనలో చాలావరకు నిరుపేదలకు సాయం చేయడానికి ఉపయోగిస్తున్నాడు. పిల్లల చదువులు, నిస్సహాయులైన వృద్ధులను ఆదుకోవడం, వికలాంగులకు సహాయం చేయడం, తగిన వైద్య సదుపాయాలు లేని ప్రదేశాలకు అంబులెన్స్‌లు కొనుగోలు చేయడం, వైద్య సహాయం చేశాడు. తుఫాను కారణంగా నష్టపోయిన 200 కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచాడు. ఇటీవల ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఓ యువకుడికి ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు.
ఇప్పుడు భర్తను కోల్పోయి.. కష్టాల్లో ఉన్న ఓ నిరుపేద మహిళకు అండగా నిలిచాడు. భర్తను కోల్పోయి ముగ్గురు కూతుళ్లతో జీవనోపాధి పొందుతున్న మురుగమ్మాళ్ అనే మహిళ.. రైలులో సమోసాలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఆమెకు ఆటో నడపడం వచ్చు. సొంతంగా ఆటో కొని నడుపుతూ కుటుంబాన్ని పోషించాలని ఆమె కల. ఆ విషయం తెలుసుకున్న బాలా.. నటుడు రాఘవ లారెన్స్ వద్దకు తీసుకెళ్లాడు. లారెన్స్ ఇచ్చిన డబ్బుతో ఆటో కొని.. దానిని లారెన్స్ చేతులమీదుగానే ఆమెకు అందించాడు. దీంతో ఆ మహిళ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
KPY బాల ఒక ప్రైవేట్ టెలివిజన్ కామెడీ షో ‘కలక్కపోవటు ఎవరు’ ద్వారా బుల్లితెరపైకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ‘కుక్ విత్ కోమలి’ షోతో బాగా పాపులర్ అయ్యాడు. దాంతో వెండితెరపై నటించే అవకాశం దక్కించుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నాడు. ఎప్పుడూ సామాజిక సేవలో ముందుండే బాలా.. తనకు నటుడు లారెన్స్ స్పూర్తి అని గతంలో చాలాసార్లు చెప్పారు.