PAWAN KALYAN ” OG ” MOVIE పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OG నుంచి క్రేజీ పోస్టర్ రిలీజ్.. రగ్గడ్ లుక్‌లో ఓమి భాయ్

ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ మాత్రం సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఎన్నికల తర్వాత ఈ మూవీ షూటింగ్ తిరిగి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల పవన్ సినిమాల నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఓవైపు పవన్ ఎన్నికల హడావిడిలో ఉండగా.. మరోవైపు వన్ బై వన్ ఆయన మూవీ అప్డేట్స్ వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి చిన్న గ్లింప్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఓజీ నుంచి స్పెషల్ సర్ ప్రైజ్ రిలీజ్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు నాలుగైదు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఓజీ ఒకటి. సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం హడావిడిగా మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు తాత్కలికంగా బ్రేక్ పడింది. అటు పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ మూవీ షెడ్యూల్ వాయిదా పడింది. ఈ సినిమాలో పవన్ సరికొత్తగా గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ మాత్రం సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఎన్నికల తర్వాత ఈ మూవీ షూటింగ్ తిరిగి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల పవన్ సినిమాల నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఓవైపు పవన్ ఎన్నికల హడావిడిలో ఉండగా.. మరోవైపు వన్ బై వన్ ఆయన మూవీ అప్డేట్స్ వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి చిన్న గ్లింప్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఓజీ నుంచి స్పెషల్ సర్ ప్రైజ్ రిలీజ్ చేశారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇందులో ఇమ్రాన్ చాలా సీరియస్ గా సిగరెట్ వెలిగిస్తూ కనిపిస్తున్నారు. పోస్టర్ పై హ్యాపీ బర్త్ డే టు ఓమి భాయ్ అని రాసుంది. అంటే ఈ మూవీలో ఇమ్రాన్ ఓమి భాయ్ పాత్రలో కనిపించనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇన్నాళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో రొమాంటిక్ హీరోగా అలరించిన ఇమ్రాన్ మొదటిసారి విలనిజం చూపించనున్నారు. ఓజీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.
ఈ సినిమానే కాకుండా తెలుగులో రాబోతున్న గూఢచారి 2 మూవీలో ఇమ్రాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తున్నారు. ఓజీ చిత్రంలో ఇమ్రాన్ తోపాటు.. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, తేజ్ సప్రూ నటిస్తున్నారు. ఇక ఇందులో పవన్ జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఎన్నికల తర్వాత స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.