#Cinema

‘Operation Valentine’ which has come to OTT, where is the streaming..ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ నటించిన లెలెస్ట్‌ మూవీ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’.  పుల్వామా దాడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి, మిక్స్‌డ్‌ టాక్‌ని సంపాదించుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ  చిత్రం స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రానికి శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. మానుషి చిల్లర్‌ హీరోయిన్‌. నవదీప్‌, మిర్‌ సర్వర్‌, రుహానీ శర్మ కీలక పాత్రలు పోషించారు. 

‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ కథేంటంటే..?
అర్జున్‌ రుద్ర దేవ్‌ అలియాస్‌ రుద్ర(వరుణ్‌ తేజ్‌) భార‌తీయ వైమానిక ద‌ళంలో వింగ్‌ కమాండర్‌గా పని చేస్తుంటాడు. అక్కడే పని చేసే రాడార్ ఆఫీస‌ర్ అహ‌నా గిల్(మానుషి చిల్ల‌ర్‌)తో ప్రేమలో ఉంటాడు. అహనా చెప్పినా వినకుండా..  గ‌గ‌న‌వీధిలో అనేక ప్రయోగాలు చేస్తుంటాడు అర్జున్‌. అలా ఓ సారి ప్రాజెక్ట్ వ‌జ్ర చేపట్టి.. తొలి ప్రయత్నంలోనే విఫలం అవుతాడు. ఈ ప్రయోగంలో తన ప్రాణ స్నేహితుడు వింగ్‌ కమాండర్‌ కబీర్‌(నవదీప్‌) ప్రాణాలు కోల్పోతాడు. దీంతో ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు ప్రాజెక్ట్‌ వజ్రను బ్యాన్‌ చేస్తారు. గాయాలను నుంచి కోలుకున్న రుద్ర.. 2019లో ఆపరేషన్‌ వాలెంటైన్‌ కోసం రంగంలోకి దిగుతాడు. అసలు ఆపరేషన్‌ వాలైంటైన్‌ లక్ష్యమేంటి? ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? అర్జున్‌ రుద్ర తన టీమ్‌తో కలిసి పాకిస్తాన్‌ కళ్లు గప్పి ఆ దేశ బార్డర్‌ని క్రాస్‌ చేసి ఉగ్రవాదుల స్థావరాలను ఎలా ధ్వంసం చేశాడు? ప్రాజెక్ట్‌ వజ్ర లక్ష్యమేంటి? చివరకు అది సక్సెస్‌ అయిందా లేదా? అనేదే  మిగతా కథ

‘Operation Valentine’ which has come to OTT, where is the streaming..ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

Election 2024: Special focus of police on

Leave a comment

Your email address will not be published. Required fields are marked *