#Cinema

Nayana Tara Divorce: క్లారిటీ ఇచ్చిన నయన్

విడాకుల వార్తలకు వీడియోతో చెక్‌ పెట్టిన నయనతార దంపతులు.

ఇంటర్నెట్‌ డెస్క్: విఘ్నేశ్‌ శివన్‌ నయనతార విడిపోతున్నట్లు కొంతకాలంగా కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా నయనతార భర్తను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయడం.. మళ్లీ కొంతసేపటికి ఫాలో చేయడం. ‘నేను సర్వం కోల్పోయాను’ అని పోస్ట్‌ పెట్టడం. మళ్లీ దాన్ని డిలీట్‌ చేయడం..  ఇవన్నీ ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే వీరు ఆ రూమర్స్‌కు చెక్‌ పెట్టారు.

 కవల పిల్లలతో కలిసి వెకేషన్‌కు ఫారిన్‌ టూర్‌ వెళ్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాల్లో పోస్ట్‌ చేశారు. అలాగే, నయనతార ఫొటోలను షేర్‌ చేసిన విఘ్నేశ్‌ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. దీనికి ఆమె రిప్లై ఇస్తూ.. ‘నన్ను ఇంత గొప్ప మహిళగా మార్చినందుకు ధన్యవాదాలు’ అంటూ హార్ట్‌ ఎమోజీలు పెట్టారు. ఫారిన్‌లో ఎంజాయ్‌ చేస్తోన్న వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ప్రస్తుతం అవి ఎక్స్‌లో వైరల్‌ అవుతున్నాయి. దీంతో విడాకుల రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌ పడినట్లైంది.

ఇప్పటి వరకు తెలుగు, తమిళ భాషల్లో సత్తా చాటిన నయనతార గతేడాది  ‘జవాన్‌’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. షారుక్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. భారీ విజయాన్ని సాధించిన ఈ చిత్రం  రూ.1000కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ప్రస్తుతం ‘టెస్ట్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఆర్‌.మాధవన్‌, సిద్ధార్థ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌. శశికాంత్‌ తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో కుముద అనే పాత్రలో కనిపించనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *