#Cinema

‘Tiger Nageswara Rao’ – చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’.

పంజా విసరడమే ఆలస్యం అంటున్నాడు ‘టైగర్‌ నాగేశ్వరరావు’. బాక్సాఫీస్‌ దగ్గర వేటకి సిద్ధం అవుతున్న అతని అసలు కథేమిటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. రవితేజ కథానాయకుడిగా… అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. నుపూర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలు. రేణుదేశాయ్‌, అనుపమ్‌ ఖేర్‌ కీలకపాత్రలు పోషించారు. వంశీ దర్శకుడు. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాత. అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ట్రైలర్‌ని అక్టోబరు 3న విడుదల చేస్తున్నట్టు సినీ వర్గాలు ప్రకటించాయి. పలు రాష్ట్రాల పోలీసులకి సవాల్‌ విసిరిన టైగర్‌ నాగేశ్వరరావు కథతో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రమిది. ‘‘కథ కథనాలతోపాటు.. రవితేజ లుక్‌, ఆయన నటన థ్రిల్‌ని పంచుతాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు అంచనాల్ని పెంచాయి. అందుకు దీటుగా సినిమా ముస్తాబవుతోంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌, సంభాషణలు: శ్రీకాంత్‌ విస్సా, ఛాయాగ్రహణం: ఆర్‌.మది, ప్రొడక్షన్‌ డిజైన్‌: అవినాష్‌ కొల్లా.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *