Mansion 24 Trailer:వరలక్ష్మి శరత్‌కుమార్ నటించిన సరికొత్త వెబ్‌సిరీస్.

ఓటీటీ వేదికగా వినోదాన్ని అందించేందుకు నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) సిద్ధమయ్యారు. ‘మాన్షన్ 24’ (Mansion 24)తో ఆమె ఓటీటీలోకి అడుగుపెట్టారు.ఓంకార్ (Ohmkar) దీనికి దర్శకత్వం వహించారు. ఓ పురాతన భవంతిలోకి వెళ్లిన వారందరూ మాయం కావడం అనే సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో దీనిని తెరకెక్కించారు. సత్యరాజ్, అవికా గోర్, బిందు మాధవి, నందు, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.